అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ponnam Prabhakar | విద్యార్థినులకు మంచి విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతి విద్యార్థిని బేసిక్ ఇంగ్లీష్‌లో మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
హన్మకొండ జిల్లా (Hanmakonda District) ఎల్కతుర్తి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను మంగళవారం ఉదయం మంత్రి తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. చదువుతో పాటు క్రీడలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థినులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను అభినందించారు. ప్రతి విద్యార్థిని ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
Ponnam Prabhakar | అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మంత్రి పొన్నం ఎల్కతుర్తిలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్ఎంఆర్ గార్డెన్స్‌లో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత సహాయక ఉపకరణాలు అందించేందుకు ఏర్పాటు చేసిన నిర్ధారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జడ్పీ సీఈఓ శేషాద్రి, పీడీ డీఆర్డీఓ శ్రీను, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Aqua Cyclone | ఏపీకి అక్వా తుపాన్ ముప్పు