అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Aqua Cyclone | బంగాళాఖాతంలో అక్వాన్ తుపాన్ ఏర్పడింది. ఇది మరింత బలపడి అత్యంత తీవ్రమైన తుపాన్‌గా మారే అవకాశం ఉందన్నారు. నవంబర్ 20న తీరాన్ని దాటనుంది.
అక్వాన్ తుపాను నవంబర్ 20న కావలి, కోనసీమ మధ్య, ఒంగోలు/బాపట్ల సమీపంలో తీరాన్ని తాకనుంది. భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని మరియు తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు ఉప్పొంగే (storm surges) ప్రమాదం ఉందని హెచ్చరించింది.
Aqua Cyclone | భారీ వర్ష సూచన
ఈ తుపాన్ మంగళవారం ఉదయం 5:30 గంటలకు దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది మచిలీపట్నానికి ఆగ్నేయంగా సుమారు 660 కి.మీ దూరంలో ఉంది. నవంబర్ 19 వరకు అత్యంత తీవ్రమైన తుపాన్ బలపడి 20న మధ్యాహ్న సమయంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 120-130 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. దీని ప్రభావంతో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
Aqua Cyclone | తెలంగాణలో..
తుపాన్ ప్రభావంతో తెలంగాణలో సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ములుగు, వరంగల్, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.నవంబర్ 21న కొన్నిచోట్ల 150-200 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయి.
ఇది కూడా చదవండి..: Akvan Cyclone | ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న ‘అక్వాన్’.. 48 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం