అక్షరటుడే, వెబ్డెస్క్: ONGC Gas Leak | ఏపీలోని కోనసీమ జిల్లా (Konaseema District)లో మరోసారి ఓఎన్‌జీసీ గ్యాస్ లీకైంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు. గ్యాస్ లీక్ నేపథ్యంలో గెడ్డడ సమీపంలో హైవేపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
మామిడికుదురు మండలం గెడ్డడ–మామిడికుదురు హైవే పక్కన ఉన్న ఓఎన్‌జీసీ రీ-డ్రిల్లింగ్ బావి నుండి భారీ పరిమాణంలో గ్యాస్ లీకవుతోంది. గ్యాస్ సమీప ప్రాంతాలకు వ్యాపిస్తోందని, తీవ్రమైన గ్యాస్ వాసన వస్తోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. గ్యాస్ లీకవడాన్ని గమనించిన ప్రజలు, హైవేపై ప్రయాణిస్తున్న వాహనదారులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఈ ఘటన అనంతరం, ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు హైవేపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
ONGC Gas Leak | ప్రత్యేక బృందాలతో..
ఓఎన్‌జీసీ అధికారులు లీకేజీని అరికట్టడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారు. లీకేజీ తీవ్రత, దానిని అదుపులోకి తీసుకురావడానికి పట్టే సమయంపై వివరాలు తెలియాల్సి ఉంది. మలికిపురం మండలం, ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్‌జీసీకి చెందిన మోరీ-5 బావిలో 2026 జనవరి 5న జరిగిన బ్లోఅవుట్ ఘటనపై ఇప్పటికీ ఆందోళన చెందుతున్న స్థానికులలో ఈ సంఘటన భయాలను మళ్లీ రేకెత్తించింది.
ఇది కూడా చదవండి..: Aqua Cyclone | ఏపీకి అక్వా తుపాన్ ముప్పు