అక్షరటుడే, వెబ్‌డెస్క్: Uttarakhand Bus Accident | ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో మంగళవారం దాదాపు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంద మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. గులార్ బజార్ సమీపంలో తెల్లవారుజామున 4:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. హరిద్వార్ నుండి చమోలికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Uttarakhand Bus Accident | ఆస్పత్రికి తరలింపు
సహాయక బృందాలు సుమారు 20 మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో సోమవారం రాత్రి ఒక బొలెరో వాహనం లోతైన లోయలోకి పడిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు.
ఇది కూడా చదవండి..: NEET UG reforms | నీట్-యూజీ (NEET-UG) పరీక్షా విధానంలో సమూల మార్పులు.. బోర్డు మార్కులకు వెయిటేజీ, సీబీటీ పరీక్షలపై కసరత్తు!