Insurance Scheme | 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం..: ఎమ్మెల్యే మదన్​మోహన్​

ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టనుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Insurance Scheme | ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ప్రకటించింది. ఈ మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పథకాన్ని అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఎమ్మెల్యే మదన్​ మోహన్ (MLA Madan Mohan) ఉన్నారు.

Insurance Scheme | అనుకోని కారణాలతో కుటుంబ పెద్ద మరణిస్తే..

ఎల్లారెడ్డిలో 10,348 కుటుంబాలు, లింగంపేటలో 11,400 కుటుంబాలు, గాంధారిలో 13,239, నాగిరెడ్డిపేటలో 7,5 38 కుటుంబాలు ఉన్నాయి.  కుటుంబంలో అనుకోని కారణాలతో కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని ఎమ్మెల్యే మదన్​మోహన్​ తెలిపారు. ఈ పథకం ద్వారా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పాలనకు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకాన్ని కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు.

Insurance Scheme | అవగాహన కల్పించాలి

ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే సూచించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ క్రియాశీలక కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని, ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Armoor Court Judges | లింబాద్రిగుట్టపై ఆర్మూర్ కోర్టు న్యాయమూర్తుల పూజలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *