Delhi Building Collapse | ఢిల్లీలో కూలిన భవనం.. ఇద్దరి మృతి

ఢిల్లీలో ఓ భవనం కూలిపోయి ఇద్దరు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Delhi Building Collapse | దేశ రాజధానిలో మరో భవనం కూలిపోయింది. తూర్పు ఢిల్లీ (Delhi)లోని వివేక్ విహార్‌లో మంగళవారం ఉదయం రెండు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలగా.. ఒక వ్యక్తి, ఒక బాలుడు మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం.

షాహదారా జిల్లాలోని వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జ్వాలా నగర్ ప్రాంతంలో ఒక పాత భవనం కూలిపోయింది. అగ్నిమాపక శాఖ, ఢిల్లీ పోలీసులు మరియు అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 7-8 మందిని రక్షించారు. కూలిపోయిన కట్టడం కింద ప్రాణాలతో ఉన్నవారి కోసం సహాయక బృందాలు ఘటనా స్థలంలో గాలిస్తున్నాయి.

Delhi Building Collapse | వరుస ప్రమాదాలు

ఢిల్లీలో ఇటీవల అనేక భవనాలు కూలిపోతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తరచూ పాత భవనాలు కూలిపోయి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సెప్టెంబర్‌లో దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్‌లో, ఢిల్లీ యూనివర్సిటీ కళాశాల పక్కనే ఉన్న పేయింగ్ గెస్ట్ వసతిగా ఉపయోగిస్తున్న ఆరు అంతస్తుల భవనం కూలిపోవడంతో ఐదుగురు విద్యార్థులు, మరో ఇద్దరు మృతి చెందారు. చావ్రీ బజార్​లో ఈ నెల 5న ఓ భవనం కూలిపోయింది. ఈ క్రమంలో అధికారులు స్పందించి నివాస యోగ్యం కాని భవనాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Uttarakhand Bus Accident | లోయలో పడిన బస్సు.. ఆరుగురి మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *