Development Works | అభివృద్ధి పనుల్లో నాణ్యత ఎంతో ముఖ్యం: ఎమ్మెల్యే ధన్​పాల్

అర్బన్ నియోజకవర్గంలో కొనసాగుతున్న పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Development Works | అర్బన్ నియోజకవర్గంలో కొనసాగుతున్న పనుల్లో నాణ్యత ఎంతో ముఖ్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ స్పష్టం చేశారు. నగరంలోని 22, 25, 35వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.

Development Works | ప్రతి డివిజన్​కు రూ.20 లక్షల నిధులు..

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన కార్పొరేషన్ కౌన్సిల్​లో ప్రతి డివిజన్​కు రూ.20లక్షల నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో అన్ని డివిజన్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశామన్నారు. అలాగే డివిజన్​కు రూ. కోటి పనులు కూడా కొన్ని డివిజన్లో ప్రారంభమయ్యాయని, మరికొన్ని ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు.

Development Works | అమృత్​–2 పథకం కింద..

అమృత్ 2 పథకం కింద నగరంలో యూజీడీ పనులు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. అయితే పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎల్​నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని, పొదుపుగా వాడుకోవాలన్నారు. కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి, 22వ డివిజన్ కార్పొరేటర్ వైష్ణవి సుధ, 25వ డివిజన్ కార్పొరేటర్ చింతకాయల రాజేందర్, 35వ డివిజన కార్పొరేటర్ ఎర్రం సుధీర్, నాయకులు పవన్ ముందడ, శ్రీనివాస్, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bandari Naresh Appointment | బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా బండారి నరేష్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *