అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bandari Naresh Appointment | బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా, రూరల్ ఇన్ఛార్జీగా బండారి నరేష్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులుతో కలిసి నియామక పత్రాన్ని అందజేశారు.
Bandari Naresh Appointment | బీసీ సంఘం బలోపేతానికి..
జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ.. బీసీ సంఘం బలోపేతం చేయడంలో భాగంగా సంఘం పటిష్ట నిర్మాణాన్ని చేయాలని జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారన్నారు. ఆయన సూచనల మేరకు గురువారం బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిగా, నిజామాబాద్ (Nizamabad) రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జీగా బండారి నరేష్‌ను నియమించామన్నారు. నిజామాబాద్ జిల్లాలోనే పెద్దదైన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బండారి నరేష్ నియామకంతో సంఘం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం బాధ్యులు దర్శనం దేవేందర్, కొయ్యడ శంకర్, దేశాయి గంగాధర్, అంకం రావు, బాలన్న, హన్మాండ్లు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Dharpally Area Hospital | డిసెంబర్‌లోగా ధర్పల్లి ఏరియా ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తిచేయాలి