అక్షరటుడే, డిచ్పల్లి: Dharpally Area Hospital | డిసెంబర్లోగా ధర్పల్లి ఏరియా ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. ధర్పల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్నును ౩౦ పడకల స్థాయి నుండి 100 పడకలకు పెంచుతూ ఏరియా ఆస్పత్రిగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసిన నేపథ్యంలో నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం పరిశీలించారు.
Dharpally Area Hospital | రూ. 33.15 కోట్ల నిధుల నిధులతో..
రూ. 33.15 కోట్ల నిధులను వెచ్చిస్తూ అధునాతన వసతులతో నూతన భవన నిర్మాణం జరుపుతున్నారు. కలెక్టర్ ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే 90శాతం వరకు పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించి పెండింగ్ పనుల వివరాలు తెలుసుకున్నారు. మిగితా పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మాతాశిశు, పీడియాట్రిక్ విభాగాలు, క్యాజువాలిటీ, రేడియాలజీ, ఆపరేషన్ థియేటర్లు, ఆయుష్ బ్లాక్, మేల్, ఫిమేల్ వార్డు, ఆప్తాలమిక్, డెంటల్, ఓ.టీ, డయాగ్నొస్టిక్ తదితర విభాగాలను కలెక్టర్ సందర్శించి పనుల నాణ్యతను పరిశీలించారు.
Dharpally Area Hospital | నాణ్యత విషయంలో రాజీ వద్దు..
నాణ్యత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడవద్దని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పనులు చేపట్టే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే తమ దృష్టికి తేవాలని సూచించారు. తుది దశ పనులను క్రమం తప్పకుండా సందర్శిస్తూ పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల నిర్మాణాలు, నిర్దేశించిన విధంగా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయా లేదా అన్నది నిర్ధారణ చేసుకున్న తరువాతే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని సూచించారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ గవర్నింగ్ కౌన్సిల్ చైర్ పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగరావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, స్థానిక తహశీల్దార్ శాంత పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Food Safety Raids | ఈ స్వీట్లు తింటే ఆస్పత్రికే.. అపరిశుభ్రతకు కేరాఫ్ ఆడ్రస్గా తయారీ కేంద్రాలు..