అక్షరటుడే,కోటగిరి : Kollur Stream Flood | నిజామాబాద్ జిల్లాలో మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తన్నాయి. దీంతో కోటగిరి మండలంలోని కొల్లూరు వాగు పొంగిపొర్లుతోంది.
Kollur Stream Flood | రాకపోకలు నిషేధం..
కొల్లూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుడడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోతంగల్ మండలం (Pothangal Mandal) కొల్లూర్ సర్పంచ్ జగన్ సూచించారు. వాగు పొంగిపొర్లుతుండడంతో బోధన్ నుంచి సుంకిని, కొల్లూర్ వచ్చే వాహనదారులు, ఇటువైపు నుంచి రావొద్దన్నారు. అలాగే కొల్లూరు నుంచి అటువైపు వెళ్లకుండా జీపీ అధికారులు ట్రాక్టర్ను అడ్డుపెట్టారు. భారీవర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. శిథిలావస్థలకు చేరిన ఇళ్లలో ఉండవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రాకూడదని కోరారు. భారీవర్షాల కారణంగా కరెంటు స్తంభాలకు తాకకూడదని అన్నారు.
ఇది కూడా చదవండి..: Oora Pandaga Security | ఊర పండుగకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు: సీపీ సాయిచైతన్య