El Nino Water Conservation | ఎల్​నినో నేపథ్యంలో నీటి పొదుపును పాటించాలి.. ఎంపీ అర్విద్​

ఎల్​నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు నీటి పొదుపును పాటించాలని ఎంపీ అర్వింద్ సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: El Nino Water Conservation | ఎల్​నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు నీటి పొదుపును పాటించాలని ఎంపీ అర్వింద్ సూచించారు. కలెక్టరేట్​లో ‘దిశ’ సమావేశంలో ఆయన మాట్లాడారు.

El Nino Water Conservation | నీటి వనరులను జాగ్రత్తగా..

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ (MP Arvind) మాట్లాడుతూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. మాధవనగర్, అర్సపల్లి ఆర్వోబీ నిర్మాణాల్లో ఎనలేని తాత్సారం జరుగుతోందని సంబంధిత అధికారులతో అసహనం వ్యక్తం చేశారు. నాలుగైదు నెలలలో పనులు పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులను కూడా వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. అమృత్ 2.0 పథకం కింద చేపడుతున్న తాగునీటి సరఫరా మెరుగుదల పనులను, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.

El Nino Water Conservation | యాసంగిలో వరి వేస్తే కష్టమే..

కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఎల్​నినో నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు వెల్లడించారు. ప్రస్తుత యాసంగిలో పంటలకు సాగునీరు అందించే పరిస్థితి లేదన్నారు. వర్షాభావం, ఇతర పరిస్థితులను పరిగణలోకి తీసుకుని జిల్లాలోని 18 మండలాలలో సాధారణ కరువు నెలకొని ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రబీలో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా జొన్న, పప్పు దినుసులు వంటి ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతు వేదికల ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. గతేడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఇదే సమయానికి 80టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 35 టీఎంసీలే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, మేయర్ కే.ఉమారాణి, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఆర్వో గీత, డీఆర్డీవో సాయన్న, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, వివిధ శాఖల అధికారులు, దిశా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Open Plots | వెంచర్లలో ‘ఓపెన్​ స్థలాల’ దండా.. కామారెడ్డిలో పట్టించుకోని బల్దియా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *