Arsapalli ROB Works | నేను రోడ్డెక్కితేనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది..: ఎంపీ అర్వింద్​

తాను దిగొచ్చి మాధవనగర్​ ఆర్వోబీ వద్ద నిరసన దీక్ష చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి నిధులిచ్చిందని ఎంపీ అర్వింద్​ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Arsapalli ROB Works | తాను దిగొచ్చి మాధవనగర్​ ఆర్వోబీ వద్ద నిరసన దీక్ష చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి నిధులిచ్చిందని ఎంపీ అర్వింద్​ అన్నారు. శనివారం ఆయన అర్సపల్లి ఆర్వోబీ పనులను పరిశీలించారు.

Arsapalli ROB Works | బీజేపీ దీక్ష ఎఫెక్ట్​..

బీజేపీ దీక్షతోనే రాష్ట్ర ప్రభుత్వం కదిలివచ్చిందని ఎంపీ అర్వింద్​ (MP Arvind) అన్నారు. మాధవనగర్ ఆర్వోబీకి భూసేకరణ అనుమతులు వచ్చాయన్నారు. అర్సపల్లి బోధన్ ఆర్వోబీ పనులు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ముందుకు సాగటం లేదని స్పష్టం చేశారు. అర్సపల్లి ఆర్వోబీని కేంద్రం రూ.137కోట్ల నిధులతో చేపట్టిందన్నారు. అర్సపల్లి ఆర్వోబీ మైనారిటీ ఏరియాలో ఉన్న ఫ్లై ఓవర్ అన్నారు. మైనారిటీలు బీజేపీకి ఓట్లు వేయకున్నా వారికోసం కొట్లాడుతున్నామని ఆయన అన్నారు. కేవలం భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు ఇవ్వాలి. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టలేదన్నారు. రైల్వే సిగ్నల్ షిఫ్టింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక లేఖ కూడా రాయట్లేదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: El Nino Water Conservation | ఎల్​నినో నేపథ్యంలో నీటి పొదుపును పాటించాలి.. ఎంపీ అర్విద్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *