అక్షరటుడే, కామారెడ్డి: Voter Forms Survey | బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ ఫారాలు పూర్తి చేయాలని కామారెడ్డి(Kamareddy MLA) ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA KVR) సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, బూత్ లెవల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Voter Forms Survey | బీఎల్వోలదే బాధ్యత..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్‌లో భాగంగా ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి ఇన్యూమరేషన్ ఫారం అందించి దరఖాస్తు పూర్తి చేయించడం బీఎల్వోల బాధ్యత అని స్పష్టం చేశారు. వారిని ఒకేచోటికి రప్పించుకోకుండా బీఎల్వోలే ఇంటింటి పర్యటన చేసి త్వరితగతిన నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా వరద నీరు రోడ్లపైకి చేరకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పారిశుధ్య నిర్వహణలో సరైన ప్రణాళికతో పనిచేసి చెత్త పేరుకుపోకుండా చూడాలని అధికారులకు సూచించారు. అక్రమ కట్టడాలు, అక్రమ వెంచర్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఇంటి పన్నులు వందశాతం సాధ్యమైన మేరకు వసూలు చేసి మున్సిపల్ ఆదాయాన్ని పెంచితేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభివృద్ధి నిధులు అందుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు, విజయ్ దేవరకొండ