MLA KVR | ఎమ్మెల్యే కేవీఆర్​కు న్యాయస్థానంలో ఊరట..

కామారెడ్డి ఎమ్మెల్యేకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి భారీ ఉపశమనం లభించింది. పట్టణంలో ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా నమోదైన కేసులను కోర్టు కొట్టివేసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: MLA KVR | కామారెడ్డి (Kamareddy) ఎమ్మెల్యేకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి భారీ ఉపశమనం లభించింది. పట్టణంలో ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా నమోదైన కేసులను కోర్టు కొట్టివేసింది.

MLA KVR | 2023లో ప్రజా ఆందోళనల్లో..

2023లో జరిగిన ప్రజా ఆందోళనల్లో పాల్గొన్నందుకు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై (MLA Venkata Ramana Reddy) కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను హైదరాబాద్ నాంపల్లిలోని(Nampally Court) ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ప్రజల ఆస్తులు, రైతుల భూములు, పట్టణ వాసుల హక్కుల పరిరక్షణ కోసం జరిగిన ధర్నాలు, బతుకమ్మ కార్యక్రమాలు, వంటావార్పు, ర్యాలీలు వంటి ప్రజాస్వామ్య నిరసనల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రజలకు మద్దతు తెలిపారు.

MLA KVR | ఆధారాల్లేని కారణంగా..

ఈ కేసులను సమగ్రంగా పరిశీలించిన కోర్టు, అభియోగాలను కొనసాగించేందుకు తగిన ఆధారాలు లేవని నిర్ధారించి కొట్టివేసినట్లు న్యాయవాదులు తెలిపారు. ఎమ్మెల్యే తరపున వాదించిన అడ్వకేట్లు ఎల్. ప్రభాకర్ రెడ్డి, వై. రాములు, టి. ఉదయ్ రాజ్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా చేసిన ఆందోళనలను నేరంగా పరిగణించలేమని, న్యాయస్థానం వాస్తవాలను పరిశీలించి న్యాయం చేసిందని పేర్కొన్నారు.

courts

ఇది కూడా చదవండి: గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్​న్యూస్​ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *