TU Exams | తెలంగాణ యూనివర్సిటీలో పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ యూనివర్సిటీలో వివిధ విభాగాలకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు కంట్రోలర్ సంపత్ కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, తెయూ క్యాంపస్​: TU Exams | తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) వివిధ విభాగాలకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు కంట్రోలర్ సంపత్ కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు.

TU Exams | 29 నుంచి బీఈడీ, బీపీఈడీ నాల్గో సెమిస్టర్ పరీక్షలు

యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, బీపీఈడీ(BPED Exams) నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్​ను సందర్శించాలన్నారు.

4 నుంచి వన్​టైం ఛాన్స్ డిగ్రీ బ్యాక్‌లాగ్ పరీక్షలు

యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2016 నుంచి 2020 బ్యాచ్‌ల విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ బ్యాక్‌లాగ్ (Degree Backlog Exams) పరీక్షలు వచ్చేనెల 4 నుంచి జరుగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్​లో పొందుపర్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయా తేదీలకనుగుణంగా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.

Telangana University

ఇది కూడా చదవండి: మ‌ర్రిప‌ల్లి చెరువు క‌బ్జాల తొల‌గింపు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *