అక్షరటుడే వెబ్‌డెస్క్: Karnataka Cabinet Expansion | కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ, మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కాంగ్రెస్ ( Congress)హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. కేబినెట్లో బెర్త్ కోసం ఎమ్మెల్యేల నుంచి తీవ్రమైన పోటీ నెలకొనడంతో పాటు, వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Karnataka Cabinet Expansion | లాబీయింగ్‌తో అధిష్టానానికి చిక్కులు..
జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, ఉప ముఖ్యమంత్రిగా జి.పరమేశ్వరతో పాటు మొత్తం 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం 34 స్థానాలు ఉండగా, ఇంకా 20 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవుల కోసం సీనియర్లతో పాటు కొత్త ఎమ్మెల్యేలు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తమ అనుచరులకు అవకాశం కల్పించాలని పలువురు మఠాధిపతులు, సామాజిక వర్గ నాయకులు బహిరంగంగానే లాబీయింగ్ చేస్తుండటం అధిష్టానానికి ఇబ్బందిగా మారింది.

Karnataka Cabinet Expansion | హైకమాండ్ హెచ్చరిక..
మంత్రి పదవుల కోసం మఠాలు, కమ్యూనిటీల ద్వారా ఒత్తిడి తీసుకురావడం , బహిరంగ నిరసనలకు దిగడంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఇటువంటి చర్యలు పార్టీ క్రమశిక్షణను దెబ్బతీస్తాయని, అనవసరమైన వర్గపోరుకు దారితీస్తాయని గట్టిగా హెచ్చరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నిరసనలు, ప్రదర్శనలతో కాకుండా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని స్పష్టం చేసింది. త్వరలోనే ఈ 20 స్థానాలకు సంబంధించి హైకమాండ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Gurukul Students Benefits | గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్