Kavitha CM Target | కవితక్కను సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం

కవితక్కను సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రక్షణ సేన కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ పేర్కొన్నారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kavitha CM Target |  కవితక్కను సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రక్షణ సేన కామారెడ్డి జిల్లా (Kamareddy District) అధ్యక్షుడు సంపత్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.

Kavitha CM Target | త్వరలో వాడవాడలా జెండా సంబురం..

ఆయన మాట్లాడుతూ.. వాడవాడలా జెండా పండుగ సంబరం కొనసాగుతోందని, జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో జెండావిష్కరణ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలను పట్టించుకోవడం లేదని, నిజమైన ప్రజా నాయకురాలు కవిత (Kalvakuntla Kavitha) అని పేర్కొన్నారు. కవితక్కను సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, ఆమెను సీఎం చేసుకొని పాంచజన్యం పథకాలను అమలు చేసుకుందామని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, రైతుల సమస్యలు అనేకం ఉన్నాయని, సమస్యలన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Kavitha CM Target

కవిత లాంటి నాయకురాలు సీఎం అయితేనే బతుకులు మారతాయని, కవిత నాయకత్వంలో పని చేయడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారని తెలిపారు. కవిత సీఎం అయ్యే వరకు నిరంతరం పని చేస్తామని, తెలంగాణ రక్షణ కోసమే తెలంగాణ రక్షణ సేన ఏర్పాటైందని సంపత్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇన్​ఛార్జి గైని శ్రీనివాస్ గౌడ్, పార్టీ రాష్ట్ర నాయకులు కోలా శ్రీనివాస్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు వసంత, రాష్ట్ర నాయకులు వేముల బలరాం, కామారెడ్డి నాయకులు వినోద్, రాము, అఫ్రిన్, జైనబ్, ప్రియాంక, డైనాయల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..:Government School | తన పిల్లలను సైతం సర్కారు స్కూళ్లోనే.. ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయుడు..

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *