Voter List Deletions | ఎన్నికల సంఘం నిర్దాక్షిణ్యంగా ఓట్లను తొలగించింది: మహేశ్‌కుమార్‌గౌడ్

ఎన్నికల సంఘం అకారణంగా, నిర్దాక్షిణ్యంగా లక్షలాది మంది ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Voter List Deletions | ఎన్నికల సంఘం అకారణంగా, నిర్దాక్షిణ్యంగా లక్షలాది మంది ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్  ( Mahesh Kumar Goud ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా పేద ప్రజలు, వలస కూలీలే తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) అసలు ఎవరి ఇంటికీ వెళ్లకుండానే సర్వేను ముగించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

Voter List Deletions | కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. సీబీఐ, ఈడీ తరహాలోనే ఎన్నికల సంఘాన్ని కూడా కేంద్రం తన నియంత్రణలోకి తీసుకుందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అకారణంగా దాదాపు కోట్లలో ఓట్లను తొలగించడం ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేశారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో ముడిపెట్టి నిబంధనలు విధిస్తూ, అర్హులైన పౌరులకు ఓటు హక్కు దూరమయ్యేలా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పాత జాబితాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతీ పౌరునికి వెంటనే ఓటు హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి:  PACS Committees | సొసైటీల పాలకవర్గాల నియామకంలో కొత్తవారికే అవకాశం!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *