అక్షరటుడే, మెండోరా: Sriramsagar Flood | నాలుగైదు రోజులుగా జిల్లాతో పాటు మహారాష్ట్ర (Maharashtra)లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్కు వరద వస్తోంది.
Sriramsagar Flood | 99శాతం నిండిన విష్ణుపురి..
వర్షాల కారణంగా మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంచడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. అలాగే విష్ణుపురి ప్రాజెక్టు 99శాతం నిండినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో రూపంలో 3,472 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 80.501 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,080.40 అడుగుల వద్ద 46.057 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
Sriramsagar Flood | గతేడాది కంటే తక్కువ
గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1,091 అడుగుల వద్ద 80.501 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గత ఏడాదితో పోలిస్తే సుమారు 34 టీఎంసీల నీటి నిల్వ తక్కువగా ఉంది. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 502 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, అలీసాగర్‌కు 540 క్యూసెక్కులు, గుప్తాకు 135 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,558 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Rice Millers | తనిఖీల పేరుతో మిల్లర్లను వేధించొద్దు..