అక్షరటుడే, వెబ్డెస్క్: Modi Jinping Meeting | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఒక కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఇద్దరు నాయకులు సరిహద్దు, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, వీసాలు, విమాన సర్వీసులు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శనివారం బీజింగ్ నుంచి బయలుదేరి న్యూఢిల్లీ (New Delhi)కి చేరుకోనున్నారు. సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్ భారతదేశంలో పర్యటిస్తున్నారు.
Modi Jinping Meeting | జిన్‌పింగ్ పర్యటన ఎందుకు కీలకం..!
2020 తూర్పు లడఖ్ ప్రతిష్టంభన తర్వాత సుదీర్ఘకాలం పాటు స్తంభించిన సంబంధాలను మెరుగుపర్చేందుకు భారత్, చైనాలు చేస్తున్న ప్రయత్నాల మధ్య ఈసారి జిన్‌పింగ్ పర్యటన జరుగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Modi Jinping Meeting | ప్రధాని మోదీ-షి జిన్‌పింగ్ సమావేశం
ఢిల్లీలో జరిగే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. సరిహద్దు, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, వీసాలు, విమాన సర్వీసులు వంటి అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించే అవకాశం ఉంది.
Modi Jinping Meeting | 2019లో పర్యటన
చైనా అధ్యక్షుడు చివరిసారిగా 2019లో చెన్నై సమీపంలోని మామల్లపురంలో ప్రధాని మోదీతో అనధికారిక శిఖరాగ్ర సమావేశం కోసం భారతదేశాన్ని సందర్శించారు. అంతకు ముందు.. ఆయన 2016లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి గోవాను సందర్శించారు. 2014 సెప్టెంబర్‌లో భారతదేశంలో తన మొదటి పర్యటన చేశారు.
ఇది కూడా చదవండి..: PMAY Urban 2.0 | మోదీ మీ ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు ఇస్తున్నారు… త్వరపడండి