Oora Pandaga Security | ఊర పండుగకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ నగరంలో ఆదివారం నిర్వహించనున్న ఊర పండుగకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Oora Pandaga Security | నగరంలో ఆదివారం నిర్వహించనున్న ఊర పండుగకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని శుక్రవారం దేవతామూర్తులు తయారుచేసే ప్రాంతాలను, రహదారులను ఆయన పరిశీలించారు.

Oora Pandaga Security | కొండెంగ హన్మాండ్ల వద్ద..

మొదటగా సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఊర పండుగకు సంబంధించి దేవతామూర్తులు తయారవుతున్న కొండెంగ హన్మాండ్లు ఆలయం వద్ద తనిఖీలు నిర్వహించారు. అనంతరం అక్కడినుంచి గోల్​హన్మాన్​, సిర్నాపల్లి గడి తదితర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖిల్లా చౌరస్తా నుంచి దేవతామూర్తులు ఊరేగింపు సందర్భంగా ఆద్యంతం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖిల్లా చౌరస్తా నుంచి లక్ష్మీ మెడికల్​, పులాంగ్​, మహాలక్ష్మి నగర్ దుబ్బ ప్రాంతాల్లోనూ పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. ప్రజలు సైతం పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ ప్రతినిధి రామర్తి గంగాధర్, కార్పొరేటర్ మహేందర్, రామడుగు బాలకిషన్, నరేష్, సీఐలు సతీష్, శ్రీనివాస్​ రాజ్, వన్​టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి, ఎస్సై యాదగిరి, సీసీఎస్​ సీఐ, ఎస్​బీ, ఇంటెలిజెన్స్​ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

11 1

ఇది కూడా చదవండి..: SRSP Flood Inflow | శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద: 24 గంటల్లోనే ఐదు టీఎంసీలు చేరిక..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *