అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rega Kantha Rao Case | భారత రాష్ట్ర సమితి (BRS) నాయకుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై హైదరాబాద్ (Hyderabad)లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో ఓ యువతిని లైంగికంగా వేధించారంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
Rega Kantha Rao Case | ఫిర్యాదులోని అంశాలు..
యూట్యూబ్ ఛానల్ పేరుతో ఓ ఫ్లాట్‌కు పిలిపించి తనను వేధించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, తన ప్రైవేటు ఫొటోలతో ఆయన బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ పేరుతో తన వద్ద రూ. 4 లక్షలు తీసుకుని మోసం చేశారని కూడా అందులో తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈనెల 26నే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Rega Kantha Rao Case | బీఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్..
బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69, సెక్షన్ 351(2) (నేరపూరిత బెదిరింపులు) కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన పోలీసులు, సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పై లైంగిక వేధింపుల కేసు
పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసిన యువతి
ఈ నెల 26న కేస్ నమోదు చేసిన పోలీసులు
ఇంటర్వ్యూ పేరుతో తన ఫ్లాట్‌కు పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు యువతి ఫిర్యాదు
— RTV (@RTVnewsnetwork) July 31, 2026
ఇది కూడా చదవండి..: Hyderabad Rain Alert | వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి : సీపీ సజ్జనార్