అక్షరటుడే, ఇందూరు: Fuel Prices | ప్రజా వ్యతిరేక విధానాలను మోదీ ప్రభుత్వం విడనాడాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ (CPI (ML) Massline) పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నిజామాబాద్ అర్బన్ (Nizamabad Urban) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నాయకులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.
Fuel Prices | క్రూడ్ ధరలు తగ్గినప్పటికీ..
ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం (Modi Government) పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నా ఇంధన ధరలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలన్నారు. ఎస్ఐఆర్ (SIR) పేరుతో తమ పార్టీని విభేదిస్తున్న వారి ఓటు హక్కును కాలరాసే కుట్రలు చేయడం బీజేపీ నాయకత్వంలోని మోదీ ప్రభుత్వం మానుకోవాలన్నారు. వెంటనే ఎస్ఐఆర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Fuel Prices | ప్రజల జీవన స్థితిగతులను చిన్నాభిన్నం..
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికే భారత ఆర్థిక రంగాన్ని, ప్రజల జీవన స్థితిగతులను చిన్నాభిన్నం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని హితవు పలికారు. లేకపోతే ప్రజలు ప్రజాసంఘాలు వామపక్ష, ప్రతిపక్ష పార్టీలు కలిసి తగిన బుద్ధి చెప్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు నరేందర్ జిల్లా నాయకులు ఎం.వెంకన్న, రాజేశ్వర్, గంగాధర్, సుధాకర్, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు సంధ్యారాణి, గణేష్, అనిల్ కుమార్, అషుర్, సాయిబాబా, ఒడ్డెన్న, సాయరెడ్డి, భాస్కర స్వామి, విఠల్, అమూల్య, రమేష్, చరణ్, సాయిలు, గంగాధర్, సృజన్, మానస, లక్ష్మి, లలిత తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: HYDRAA Eagle Team | హైడ్రాలో ‘ఈగల్ టీమ్’ సంచలనం..కబ్జాలను అడ్డుకోవడంలో ట్రాన్స్జెండర్ల కీలక పాత్ర


