హైదరాబాద్HYDRAA Eagle Team | హైడ్రాలో ‘ఈగల్ టీమ్’ సంచలనం..కబ్జాలను అడ్డుకోవడంలో ట్రాన్స్‌జెండర్ల కీలక పాత్ర

HYDRAA Eagle Team | హైడ్రాలో ‘ఈగల్ టీమ్’ సంచలనం..కబ్జాలను అడ్డుకోవడంలో ట్రాన్స్‌జెండర్ల కీలక పాత్ర

ఒకప్పుడు సమాజంలో అవహేళనలు, వివక్షను ఎదుర్కొన్న ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కొత్త వెలుగులు నింపింది.

అక్షరటుడే వెబ్‌డెస్క్ :HYDRAA Eagle Team | ఒకప్పుడు సమాజంలో అవహేళనలు, వివక్షను ఎదుర్కొన్న ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కొత్త వెలుగులు నింపింది. హైడ్రా కల్పించిన ఉద్యోగ అవకాశాలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, సమాజంలో తలెత్తుకుని జీవించేలా గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.

ప్రస్తుతం ఈ విభాగంలో మొత్తం 16 మంది ట్రాన్స్‌జెండర్లు (11 మంది ట్రాన్స్ ఉమెన్, 5 గురు ట్రాన్స్ మెన్) విధుల్లో చేరి అద్భుతాలు సృష్టిస్తున్నారు. వీరందరితో హైడ్రా ప్రత్యేకంగా ‘ఈగల్ టీమ్’ను ఏర్పాటు చేసింది. చెరువులు, నాలాల కబ్జాలను అడ్డుకోవడంలోనూ, పార్కులు, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడంలోనూ ఈ టీమ్ ఎక్కడా వెనకడుగు వేయకుండా దూసుకుపోతోంది.

HYDRAA Eagle Team | క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలు..

ఆక్రమణదారులు ఎంతటి వారైనా భయపడకుండా ఈగల్ టీమ్ బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలోని ఐలాపూర్‌లో రికార్డు స్థాయిలో 862 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించడంలో ఈ టీమ్ కీలక పాత్ర పోషించింది. అలాగే మాదాపూర్‌లోని ఈదులకుంట చెరువు ఆక్రమణలను తొలగించేటప్పుడు కూడా వీరు ముందుండి నడిచారు. సమస్యలు ఉన్నచోట స్థానిక ప్రజలకు నచ్చజెప్పడం, మహిళలతో శాంతంగా మాట్లాడి పరిస్థితులను అదుపులోకి తేవడం, అధికారులకు-ప్రజలకు మధ్య వారధిగా నిలవడంలో వీరు చూపిస్తున్న చొరవను హైడ్రా ఉన్నతాధికారులు సైతం మెచ్చుకుంటున్నారు. ట్రాన్స్‌జెండర్లలో ఉండే సహనం, ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకునే గుణమే క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలను ఇస్తోందని అధికారులు ప్రశంసిస్తున్నారు.

hydra.2

HYDRAA Eagle Team | ‘ఈగల్ టీమ్’ సభ్యులు మాటల్లో..

డబ్బు కంటే గౌరవమే ముఖ్యం: గాయత్రి
“మాకు డబ్బు కంటే సమాజంలో గౌరవంగా బతకడమే ముఖ్యం. ఇప్పుడు హైడ్రా యూనిఫాం వేసుకుని డ్యూటీకి వెళ్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తోంది. మాకు అవకాశం ఇస్తే ఏ రంగంలోనైనా రాణించగలమని నిరూపించుకున్నాం. మమ్మల్ని తోటి ఉద్యోగులంతా సమానంగా చూస్తున్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి, హైడ్రా కమిషనర్‌కు కృతజ్ఞతలు.”

HYDRAA Eagle Team | ప్రకృతిని రక్షించడంలో భాగమయ్యాం: రుచిత

“ప్రకృతిలో అందరితో పాటు మేము కూడా భాగమే. ఇప్పుడు అదే ప్రకృతిని, సమాజ ఆస్తులను కాపాడే బాధ్యత మాకు రావడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలను కాపాడుతున్నాం. ప్రజల్లో హైడ్రాపై ఉన్న నమ్మకాన్ని మేము నిలబెడతాం.”

hydra.1

బిక్షాటన నుంచి గౌరవప్రదమైన ఉద్యోగం వైపు: తాన్షీరాయ్
“గతంలో తిండి కోసం బిక్షాటన చేసేవాళ్లం. ఎక్కడికి వెళ్లినా అవమానాలు, ఎగతాళి ఎదురయ్యేవి. పని అడిగితే ఎవరూ ఇచ్చేవారు కాదు. కానీ ఈ రోజు హైడ్రా యూనిఫాం వేసుకుని విధుల్లోకి వెళ్తుంటే జనం మమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నారు. ఇప్పుడు నెలనెలా జీతం వస్తుండటంతో మా కుటుంబాలకు కూడా ఆర్థికంగా అండగా నిలవగలుగుతున్నాం.”

ఇది కూడా చదవండి: Ganga Expressway Cracks | మోదీ ప్రారంభించిన రోడ్డు, నెలలోపే పగుళ్లు… అదానీ ఇదేంటి?

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...

Hormuz Strait Blockade | హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత.. అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Blockade | వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం...