సినిమాPeddi Trolling | ‘పెద్ది’పై నెగిటివ్ ట్రోలింగ్.. పోలీసులకు చిత్ర యూనిట్ ఫిర్యాదు

Peddi Trolling | ‘పెద్ది’పై నెగిటివ్ ట్రోలింగ్.. పోలీసులకు చిత్ర యూనిట్ ఫిర్యాదు

రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాపై సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ చిత్ర యూనిట్ పోలీసులను ఆశ్రయించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Peddi Trolling | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ సోషల్ మీడియా (Social Media)లో ఈ సినిమాపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. చిత్రాన్ని ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తూ, తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్న కొందరిపై ‘పెద్ది’ చిత్ర యూనిట్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది.

వచ్చే వారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో అనుమానాస్పద రీతిలో ప్రతికూల ప్రచారం జరుగుతోందని చిత్ర యూనిట్ గుర్తించింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సోషల్ మీడియా వేదికలపై కొందరు ఫేక్ అకౌంట్ల ద్వారా సినిమాపై నెగిటివ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Peddi Trolling | నెగెటివ్ అభిప్రాయం క‌లిగించే ప్ర‌య‌త్నం…

ఈ నేపథ్యంలో హైదరాబాద్, గుంటూరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు సమాచారం. ట్రోలింగ్‌కు పాల్పడుతున్న పలు సోషల్ మీడియా ఖాతాలను గుర్తించిన చిత్ర నిర్మాతలు, వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందే కావాలనే దుష్ప్రచారం చేసి ప్రేక్షకుల్లో నెగిటివ్ అభిప్రాయం కలిగించే ప్రయత్నం జరుగుతోందని చిత్ర యూనిట్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న పోస్టులు, కామెంట్లు, ట్రెండ్స్‌ను ప్రత్యేకంగా మానిటర్ చేస్తూ సాక్ష్యాలను సేకరించిన తర్వాతే పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.

Peddi Trolling | సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రెండ్

‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ.. మరోవైపు సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రెండ్ నడవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల స్టార్ హీరోల సినిమాల విషయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్, బాయ్‌కాట్ ట్రెండ్స్ పెరుగుతున్న నేపథ్యంలో.. ‘పెద్ది’ యూనిట్ తీసుకున్న ఈ లీగల్ యాక్షన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా విడుదలకు ముందు ఇలాంటి ఆర్గనైజ్డ్ ట్రోలింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Ram Charan Comments | పెళ్లికి ముందు ‘పెద్ది’ చేసి ఉంటే ఇంకా మంచి సంబంధం వచ్చేది.. ఉపాసన ముందే రామ్ చరణ్ సరదా కామెంట్స్ !

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...

Hormuz Strait Blockade | హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత.. అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Blockade | వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం...