సినిమాRam Charan Comments | పెళ్లికి ముందు ‘పెద్ది’ చేసి ఉంటే ఇంకా మంచి సంబంధం...

Ram Charan Comments | పెళ్లికి ముందు ‘పెద్ది’ చేసి ఉంటే ఇంకా మంచి సంబంధం వచ్చేది.. ఉపాసన ముందే రామ్ చరణ్ సరదా కామెంట్స్ !

‘పెద్ది’ ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ చేసిన సరదా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Ram Charan Comments | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  (Ram Charan) ప్రస్తుతం తన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ ప్రమోషన్స్‌తో దేశవ్యాప్తంగా బిజీగా ఉన్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో మూవీ టీమ్ వరుస ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహిస్తోంది.

ఈ క్రమంలో రామ్ చరణ్ చేసిన కొన్ని సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారాయి. రామ్ చరణ్, ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగినప్పటికీ.. పెళ్లికి ముందు చాలా కాలం వీరిద్దరూ రహస్యంగా ప్రేమించుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. రాత్రిళ్లు బైక్ రైడ్స్‌కు వెళ్లడం, సీక్రెట్‌గా కలుసుకోవడం వంటి విషయాలు అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తించేవి. చివరకు 2012లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Ram Charan Comments | అలా అనేశాడేంటి…

ఇప్పుడు ‘పెద్ది’ సినిమా (‘Peddi’ Movie) ప్రమోషన్స్ సందర్భంగా ఉపాసన గురించి రామ్ చరణ్ చేసిన ఫన్నీ కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి. ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchibnabu Sana)తో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ.. “ఈ సినిమా మీకు చాలా మంచి పేరు తీసుకొస్తుంది. మీకోసం మంచి సినిమా చేయాలని ఎంతో కష్టపడ్డాం” అని అన్నారు. దీనికి వెంటనే స్పందించిన రామ్ చరణ్.. “అంటే ఇప్పుడు నాకు మంచి పేరు లేదనా?” అంటూ నవ్వుతూ కౌంటర్ ఇచ్చారు.

Ram Charan Comments | “అవును.. ఇంకా మంచి సంబంధం వచ్చేదేమో”

ఆ తర్వాత బుచ్చిబాబు మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. “ఒకసారి ఉపాసన గారి సమక్షంలో నేను సరదాగా మాట్లాడాను. ‘ఈ పెద్ది సినిమా పెళ్లికి ముందు వచ్చి ఉంటే చరణ్ గారికి ఇంకా మంచి సంబంధం వచ్చేది’ అన్నాను. దాంతో ఉపాసన గారు సీరియస్ అయ్యారు” అంటూ నవ్వుతూ చెప్పారు. దీనికి రామ్ చరణ్ కూడా సరదాగా స్పందిస్తూ.. “అవును.. ఇంకా మంచి సంబంధం వచ్చేదేమో” అని అనడంతో అక్కడ నవ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ram Charan Comments | అథ్లెట్‌గా విభిన్న షేడ్స్‌లో..

ఇక ‘పెద్ది’ సినిమా విషయానికి వస్తే.. ఇది 1980ల గ్రామీణ నేపథ్యంలో సాగే భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. సినిమాలో రామ్ చరణ్ పహిల్వాన్‌గా, క్రికెటర్‌గా, అథ్లెట్‌గా విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఒక అటవీ ప్రాంతంలోని గ్రామం, అక్కడి ప్రజల ఆత్మగౌరవం, భూముల కోసం జరిగే పోరాటం నేపథ్యంలో కథ సాగుతుందని సమాచారం. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ భారీ ఎమోషన్స్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్‌తో అదిరిపోతుందని టాక్ వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి..: Peddi Ticket Prices | పెద్ది సినిమా టికెట్​ ధరల పెంపునకు అనుమతి

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...

Hormuz Strait Blockade | హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత.. అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Blockade | వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం...