Peddi Ticket Prices | పెద్ది సినిమా టికెట్​ ధరల పెంపునకు అనుమతి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Peddi Ticket Prices | మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​ (Ram Charan) హీరోగా తెరకెక్కిన పెద్ది మూవీ జూన్​ 4న విడుదల కానుంది. ఈ సినిమా టికెట్​ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం (AP Government) అనుమతి ఇచ్చింది.

బుచ్చిబాబు సానా పెద్ది సినిమాను తెరకెక్కించారు. పాన్​ ఇండియా స్థాయిలో రూపొందించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రామ్​చరణ్​ నటించిన గేమ్​ ఛేంజర్​ అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో పెద్ది మూవీ కోసం ఆయన తీవ్రంగా కష్టపడ్డాడు. ఇప్పటికే రిలీజైన టీజర్​, ట్రైలర్​లో డిఫరెంట్ లుక్​లో అదరగొట్టారు. దీంతో అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో జూన్​ 4న ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు రావడినిక మేకర్స్​ అన్ని ఏర్పాట్లు చేశారు.

Peddi Ticket Prices | ధరల పెంపు ఇలా..

పెద్ది సినిమా టికెట్​ ధరలను పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందిసింగిల్‌ స్క్రీన్‌లలో రూ.100 చొప్పున, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.పెద్ది ప్రీమియర్‌ షో టికెట్‌ ధర రూ.600గా నిర్ణయించింది. అలాగే రోజుకు ఐదు షోలు వేసుకోవడానికి సైతం ఓకే చెప్పింది. పెరిగిన రేట్లు జూన్ 4 నుంచి జూన్ 10 వరకు అమల్లో ఉండనున్నాయి. జూన్ 3 రాత్రి 8 గంటల నుంచి ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించుకునేందుకు అనుమతిచ్చింది.

Peddi Ticket Prices | గ్రామీణ నేపథ్యంలో

కాగా పెద్ది సినిమా 1980ల కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఒక సాధారణ యువకుడు క్రీడల ద్వారా తన గ్రామాన్ని ఎలా ఏకం చేశాడు అనేది కథ. మూవీలో రామ్​చరణ్ పక్కన హీరోయిన్​గా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Exhibitors Dispute | మెగాస్టార్​ చొరవతో ‘ఎగ్జిబిటర్ల’ వివాదానికి పరిష్కారం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *