Ashwin SRH Speech | తగ్గేదేలే.. SRH తగలబెట్టాలి”.. తెలుగులో అశ్విన్ ఫైర్, ఆరెంజ్ ఆర్మీకి భారీ సపోర్ట్!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ashwin SRH Speech | ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ప్రదర్శన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. భారీ స్కోర్లతో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేసిన ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి కప్పు కొట్టే జట్లలో ఫేవరెట్‌గా నిలిచింది.

అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అయినప్పటికీ వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరింత బలంగా తిరిగి వస్తుందని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ధీమా వ్యక్తం చేశాడు.

Ashwin SRH Speech | “సన్‌రైజర్స్ సన్‌సెట్ కాలేదు”

తన యూట్యూబ్ ఛానల్‌లో జరిగిన క్రికెట్ డిబేట్‌లో పాల్గొన్న అశ్విన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరును ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా తెలుగులో మాట్లాడుతూ SRH అభిమానులను ఉత్సాహపరిచాడు. చూడు బాబూ.. గేమ్ అవేర్‌నెస్ బాగా చేయాలి. ఈసారి మన సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో సన్‌సెట్ ఇంకా కాలేదు. నెక్స్ట్ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ తగలబెట్టాలి. తగ్గేదేలే.. మంచిగా ఆడాలి” అంటూ అశ్విన్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. డిబేట్ మధ్యలో ఒక్కసారిగా అశ్విన్ తెలుగులో మాట్లాడడం చూసి అక్కడున్నవాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. మొదట ఆయన ఏ భాషలో మాట్లాడుతున్నారో అర్థంకాక కాసేపు అయోమయం చెందిన ప్యానెల్ సభ్యులు.. తర్వాత అది తెలుగేనని గ్రహించి నవ్వులు పూయించారు.

Ashwin SRH Speech | భారీ స్కోర్లను గుర్తుచేస్తూ..

ఇక SRH అభిమానులు మాత్రం అశ్విన్ మాటలకు ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా “తగ్గేదేలే” అంటూ పుష్ప డైలాగ్ స్టైల్లో చెప్పడం ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇచ్చింది.ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో అద్భుతమైన క్రికెట్ ఆడిందని అశ్విన్ కొనియాడాడు. లీగ్ దశలో జట్టు చూపించిన దూకుడు, భారీ స్కోర్లను గుర్తుచేస్తూ.. ఈ టీమ్ భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు.

Ashwin SRH Speech | ఆరెంజ్ ఆర్మీ మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలి”

Ashwin SRH Speech

“ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఆరెంజ్ ఆర్మీ మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలి” అంటూ జట్టుకు తన మద్దతు ప్రకటించాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి బౌలర్లకు నిద్ర లేకుండా చేసింది. మొత్తం 15 మ్యాచ్‌లలో 9 సార్లు 200కు పైగా స్కోర్ చేయడం ద్వారా SRH తమ పవర్ హిట్టింగ్‌ను మరోసారి నిరూపించింది. 2024 తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి ప్లేఆఫ్స్‌కు చేరడం అభిమానుల్లో నమ్మకం పెంచింది. టైటిల్ అందుకోలేకపోయినా.. ఈ జట్టు చూపించిన దూకుడు, యువ ఆటగాళ్ల ప్రదర్శన, ప్యాట్ కమిన్స్ నాయకత్వం భవిష్యత్తుపై భారీ అంచనాలు పెంచుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Orange Cap Race | నేడే క్వాలిఫ‌య‌ర్ 2 .. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీతో సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ ఫైట్ !

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *