Kohli Head Controversy | కోహ్లీ–ట్రావిస్ హెడ్ వివాదం కొత్త మలుపు.. ట్రోలింగ్‌పై స్పందించిన జెస్సికా, భావోద్వేగ వ్యాఖ్యలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kohli Head Controversy | ఐపీఎల్‌లో ఆటగాళ్ల మధ్య మైదానంలో జరిగే మాటల యుద్ధాలు, వాగ్వాదాలు మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అభిమానుల్లో చర్చకు దారితీయడం కొత్త విషయం కాదు. అయితే తాజాగా ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఏర్పడిన వివాదం ఇప్పుడు వ్యక్తిగత స్థాయికి వెళ్లినట్లు కనిపిస్తోంది.

మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ (Travis Head) మధ్య మైదానంలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలో ట్రావిస్ హెడ్ షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు రాగా, కోహ్లీ స్పందించలేదని ప్రచారం జరిగింది. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

Kohli Head Controversy | హెడ్ భార్య‌కి త‌ల‌నొప్పులు…

అయితే వివాదం అక్కడితో ఆగలేదు. కొంతమంది అభిమానులు ట్రావిస్ హెడ్ భార్య జెస్సికాను Jessiaca కూడా ఈ అంశంలోకి లాగి సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌కు దిగినట్లు తెలుస్తోంది.జెస్సికా ఈ అంశంపై స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ, “ఉదయం లేచేసరికి నా సోషల్ మీడియా ఖాతాలు ద్వేషపూరిత సందేశాలతో నిండిపోయాయి. నేను మాత్రమే కాదు.. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఇలాంటి ట్రోలింగ్‌కు గురవుతున్నారు” అని పేర్కొన్నారు.ఆమె మాట్లాడుతూ గతంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని గుర్తుచేశారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టు భారత్‌పై సాధించిన కొన్ని కీలక విజయాల తర్వాత కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో ఇలాంటి ప్రతికూల స్పందనలు వచ్చాయని తెలిపారు.

Kohli Head Controversy | వివాదం ఎలా మొదలైంది అంటే..

“క్రీడల్లో పోటీ, భావోద్వేగాలు సహజం. కానీ ఆట వెనుక మనుషులు ఉంటారని, వారి కుటుంబాలు కూడా ఉంటాయని మర్చిపోవద్దు” అంటూ అభిమానులకు ఆమె విజ్ఞప్తి చేశారు. అసలు వివాదం ఎలా మొదలైంది అంటే.. మైదానంలో జరిగిన వాగ్వాదమే ఈ వివాదానికి కారణమని సమాచారం. మ్యాచ్ సమయంలో ట్రావిస్ హెడ్ కోహ్లీని ఉద్దేశించి దూకుడుగా ఆడాలని వ్యాఖ్యానించగా, దానికి కోహ్లీ స్పందించినట్లు చర్చ సాగుతోంది. తర్వాత మ్యాచ్‌లో చోటుచేసుకున్న కొన్ని సందర్భాలు ఈ ఇద్దరి మధ్య ఉద్రిక్తతకు కారణమయ్యాయని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..: Travis Head Wife Trolls | ట్రావిస్ హెడ్ భార్యపై సోషల్ మీడియాలో వేధింపులు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *