అక్షరటుడే వెబ్‌డెస్క్: Hanuman Ansh Telugu Release | ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన చిత్రం ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). ఎలాంటి భారీ అంచనాలు లేకుండా అత్యంత చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద నిర్మాతకు కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదల కానుంది.
Hanuman Ansh Telugu Release | రికార్డు కలెక్షన్స్..
కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఊహించని విధంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. 1900-1973 మధ్య కాలంలో జీవించిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా (మహరాజ్‌జీ) జీవిత చరిత్ర , ఆయన బోధనల ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Hanuman Ansh Telugu Release | హోంబలే ఫిల్మ్స్ ద్వారా రిలీజ్..
మొదట సెప్టెంబర్ 18నే ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ( Trivikram )ఈ సినిమా బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరగగా, చివరకు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ ఈ సినిమా తెలుగు విడుదల బాధ్యతలను చేపట్టి అఫీషియల్ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఇదిలా ఉంటే, అక్టోబర్ 9న ‘హనుమాన్ అంశ్’తో పాటు మరికొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ బరిలో దిగుతుండటం విశేషం. వెంకటేశ్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’, అలాగే శ్రీవిష్ణు నటిస్తున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాలు కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇది కూడా చదవండి: NTR Deepfake Video | ఏఐ మార్ఫింగ్ వీడియోపై ఎన్టీఆర్ ఫైర్.. నిందితులకు గట్టి హెచ్చరిక