అక్షరటుడే వెబ్‌డెస్క్: Jani Master Non Cooperation | ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కఠిన వైఖరిని ప్రదర్శించింది. ఆయనపై సహాయ నిరాకరణ (Non-Cooperation) కొనసాగించాలంటూ తన అనుబంధ సంఘాల జనరల్ సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Jani Master Non Cooperation | సుదీర్ఘంగా చర్చించినట్లు..
సెప్టెంబర్ 26, 27 తేదీల్లో జరిగిన ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ (A.I.F.E.C.) సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఫెడరేషన్ తన లేఖలో వెల్లడించింది. గతంలో చోటుచేసుకున్న పరిణామాలను పరిగణలోకి తీసుకుని, ఫెడరేషన్ సభ్యుల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. జాతీయ స్థాయి సమావేశంలోనూ ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు లభించిందని తెలిపింది.
Jani Master Non Cooperation | నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే..
ఫెడరేషన్ తీసుకున్న ఈ నిబంధనలను అనుబంధ సంఘాలు, నాయకులు, సభ్యులందరూ విధిగా పాటించాలని ఆదేశించింది. వ్యక్తిగత స్వార్థం కోసం ఎవరైనా ఈ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే సహించేది లేదని హెచ్చరించింది. జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణను కచ్చితంగా అమలు చేయాలని తేల్చిచెప్పింది.
ఇది కూడా చదవండి: Bheem Reddy Benami Case | మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డికి ఐటీ శాఖ షాక్..దేశ చరిత్రలోనే మొదటిసారిగా బినామీ యాక్ట్ కింద కేసులు