Bheem Reddy Benami Case | మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డికి ఐటీ శాఖ షాక్..దేశ చరిత్రలోనే మొదటిసారిగా బినామీ యాక్ట్ కింద కేసులు

ఆదాయపన్ను (IT) శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. భీమ్‌రెడ్డికి సంబంధించిన 8 మంది బినామీలపై ఐటీ శాఖ కేసు నమోదు చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bheem Reddy Benami Case | ఆదాయపన్ను (IT) శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. భీమ్‌రెడ్డికి సంబంధించిన 8 మంది బినామీలపై ఐటీ శాఖ కేసు నమోదు చేసింది. దేశంలోనే బినామీ చట్టం (బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్) కింద ఐటీ శాఖ ఈ విధంగా కేసులు నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Bheem Reddy Benami Case | వెలుగులోకి బినామీలు..

గతంలో అవినీతి నిరోధక శాఖ (ACB) నిర్వహించిన సోదాల్లో భీమ్‌రెడ్డికి సంబంధించిన వందల కోట్ల విలువైన అక్రమాస్తులు, నకిలీ ధ్రువపత్రాలు లభ్యమయ్యాయి. ఈ దర్యాప్తును మరింత లోతుగా పరిశీలించిన అధికారులు.. ఆయన తన అక్రమ సంపాదనను బినామీల పేరిట రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగా మళ్లించినట్లు పక్కా ఆధారాలు సేకరించారు. హైదరాబాద్‌లోని పుప్పాలగూడతో పాటు పలు ప్రాంతాల్లోని 8 మంది బినామీల ఇళ్లపై ఇటీవల దాడులు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

Bheem Reddy Benami Case | ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం..

ఐటీ శాఖ నమోదు చేసిన ఈ కేసుల ఆధారంగా.. బినామీల పేరిట ఉన్న ప్లాట్లు, విల్లాలు, ఫ్లాట్లు మరియు ఇతర ఆర్థిక పెట్టుబడులను జప్తు చేసేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా మనీ ల్యాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఐటీ శాఖ నేరుగా బినామీ చట్టం కింద కేసులు నమోదు చేయడంతో భీమ్‌రెడ్డి బినామీ నెట్‌వర్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ఇది కూడా చదవండి:  Subsidized Onion Price | మార్కెట్లో ఉల్లి మంట.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *