అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Konda Surekha Warning | మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు.
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత తొలిసారి ఆదివారం ఆమె కార్యకర్తలతో మాట్లాడారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari)పై విమర్శలు చేశారు. ఆయన 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీలోకి పోయి ఎమ్మెల్సీ తీసుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెల రోజులు కూడా ఆగకుండా ఇటు జంప్ అయ్యారన్నారు. గుండు సుధారాణి మీద ఆ రోజుల్లో అసమ్మతి పెడదామని అనుకుంటే, ఆమె వచ్చి కొండా మురళికి దండం పెడితే వదిలేశామని చెప్పారు. ఇప్పుడు కుడా (KUDA) ఛైర్పర్సన్ పదవి కావాలంటే ఇచ్చామని చెప్పారు. పదవి వచ్చినాక ఆమె కనీసం ఫోన్ కూడా చేయలేదన్నారు.
Konda Surekha Warning | కార్పొరేటర్‌గా గెలవాలని సవాల్
బసవరాజు సారయ్య, నాయిని రాజేందర్ రెడ్డిలకు కొండా సురేఖ (Konda Surekha Warning ) కౌంటర్ ఇచ్చారు. మైక్ చూడక చాలా రోజులు అయిందని, మైక్ కనబడగానే ఊగిపోతున్నారని విమర్శించారు. బసవరాజు సారయ్య తన మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తా అంటున్నారని, ముందు తన అనుచరుల మీద కార్పొరేటర్‌గా గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. నాయిని రాజేందర్ రెడ్డి ఆనాడు వినయ్ భాస్కర్‌ను తట్టుకోలేక నియోజకవర్గంలోని కార్యక్రమాలకు తమను బతిమాలి తీసుకెళ్లేవాడన్నారు. ఇళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఎంత మంది పోటీ పడ్డ వరంగల్ తూర్పు టికెట్ తనకే వస్తుందని సురేఖ ధీమా వ్యక్తం చేశారు. తాను మళ్లీ గెలుస్తానని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.
బసవరాజు సారయ్య, నాయిని రాజేందర్ రెడ్డిలకు కొండా సురేఖ కౌంటర్
మైక్ చూడక చాలా రోజులు అయిందని, మైక్ కనబడగానే ఊగిపోతున్నారు
బసవరాజు సారయ్య నా మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తా అంటున్నాడు
ముందు మా అనుచరుల మీద కార్పొరేటర్‌గా గెలువు
నాయిని రాజేందర్ రెడ్డి ఆనాడు వినయ్ భాస్కర్‌ను… https://t.co/YhyAy2zXHh pic.twitter.com/czCK2JFort
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2026
దీనిని కూడా చదవండి : Ganesh Immersion | నిమజ్జన ఊరేగింపుపై పోలీసుల వివాదాస్పద ఆదేశాలు!