Singareni Workers | సింగరేణి కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్​ : కవిత

సింగరేణి కార్మికులను కాంగ్రెస్​ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Singareni Workers | మొక్కుబడిగా మెడికల్ బోర్డు (Medical Board)ను నిర్వహిస్తూ మరోసారి సింగరేణి కార్మికులను కాంగ్రెస్​ ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) విమర్శించారు. 120 మంది కార్మికులను మెడికల్ బోర్డుకు పిలిచి కేవలం 12 మందినే అన్ ఫిట్​గా ప్రకటించడం అన్యాయం అన్నారు.

సింగరేణి కార్మికుల సమస్యలపై కవిత కొంతకాలంగా పోరాడుతున్నారు. బాయిబాట పేరిట ఆమె సింగరేణిలో పర్యటించారు. కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. నెలకు ఒకసారి మెడికల్ బోర్డు పెట్టాలని డిమాండ్​ చేశారు. అనారోగ్యంతో ఉన్న కార్మికులకు అన్​ఫిట్​గా ప్రకటించి వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. లేకపోతే తాను నిరాహార దీక్ష చేస్తానని సైతం ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం మెడికల్​ బోర్డు పెట్టింది. దీనిపై కవిత ఎక్స్​ వేదికగా విమర్శలు చేశారు.

Singareni Workers | కార్మికులకు న్యాయం చేయాలి

సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలని కవిత కోరారు. వారి కుటుంబాలకు భరోసా కల్పించాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మెడికల్ అన్ ఫిట్ కోసం దరఖాస్తు పెట్టుకున్న ప్రతి కార్మికుడిని అన్ ఫిట్ గా ప్రకటించి వారి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్​ చేశారు. లేకుంటే కార్మిక క్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

దీనిని కూడా చదవండి : Konda Surekha Rakhi | సీఎం రేవంత్​రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *