అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Konda Surekha Rakhi | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. రాఖీ పండుగను పురస్కరించుకొని ఆయన నివాసానికి వెళ్లిన ఆమె రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
పరకాల వివాదం తర్వాత కొండా సురేఖపై పలువురు కాంగ్రెస్ నాయకులు ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఆమె కూతురు సుష్మిత సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో సురేఖపై చర్యలు తీసుకోవడానికి పార్టీ సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో మంత్రి సురేఖ సీఎం నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి సీతక్క, కొండా సురేఖ సీఎంకు రాఖీ కట్టారు. అనంతరం సురేఖ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
Konda Surekha Rakhi | చర్యలపై ఉత్కంఠ
కొండా సుష్మిత వ్యాఖ్యలతో పార్టీలో చాలా మంది నాయకులు సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తున్నారు. ఈ క్రమంలో కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. తాజాగా కొండా సురేఖ సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టారు. ఆమెపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. చర్యలు తీసుకోకపోతే పార్టీలో క్రమ శిక్షణ దారి తప్పుతుందని, ఇతర నేతలు సైతం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారని పలువురు పేర్కొంటున్నారు.
రాఖీ పండుగ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన మంత్రులు దానసరి సీతక్క, కొండా సురేఖ
On the occasion of Rakhi, Ministers Seethakka and Konda Surekha tied a Rakhi to CM Revanth Reddy#RevanthReddy #KondaSurekha #Seethakka
• @seethakkaMLA
• @iamkondasurekha pic.twitter.com/iPRFDIKaP2— Congress for Telangana (@Congress4TS) August 28, 2026
దీనిని కూడా చదవండి : ACB DA case | మైన్స్ ఏడీ జయరాజ్‌కు 14 రోజుల రిమాండ్