అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Jaspal Singh BJP | నిజామాబాద్ (Nizamabad BJP) జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా నూతన అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ జిల్లా నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Jaspal Singh BJP | పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా..
నూతనంగా ఎంపికైన జస్పాల్ సింగ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన బీజేపీ అధిష్టానానికి, ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారికి ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో పార్టీ ఆదేశానుసారం జిల్లాలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తూ, బీజేపీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమానికి, పార్టీ అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటానని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఆ హామీ ఇస్తే.. దీక్ష విరమిస్తా: వాంగ్ చుక్