అక్షరటుడే, వెబ్డెస్క్ : BRS Protest | కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరుబాట చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల మోసంతో పాటు పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. వెయ్యి రోజులైనా నెరవేరని హామీలపై ప్రజలను చైతన్యవంతం చేయడమే కాకుండా.. కాంగ్రెస్ హామీల వైఫల్యం, అవినీతిని ఎండగట్టాలన్నారు. వారం రోజుల ప్రత్యేక నిరసన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
BRS Protest | భారీ ధర్నాలు
సెప్టెంబర్ 1న తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జీషీట్ విడుదల చేయనున్నారు. 2న హామీలు అమలు చేయాలని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని కేటీఆర్ ఆదేశించారు. 3న అన్ని నియోజకవర్గాల్లో రైతు సదస్సులు నిర్వహించి సాగునీరు, విద్యుత్, యూరియా, బీమా సమస్యలపై రైతులకు అవగాహన కల్పించారు. హైదరాబాద్లో 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యపై నిరసనలు తెలుపుతారు.
BRS Protest | మహిళలకు ఇచ్చిన హామీలపై..
మహిళలకు ఇచ్చిన హామీల అమలు వైఫల్యంపై సెప్టెంబర్ 4న నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు. మహిళలు, వికలాంగులతో ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేస్తారు. 5న విద్యార్థులు, యువతతో నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు తీస్తారు. 6న హైదరాబాద్లో నగర సమస్యలపై ఆటోలతో భారీ ర్యాలీ, 7న ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ హామీల వైఫల్యంపై వినతిపత్రాలు అందించాలని పార్టీ నిర్ణయించింది. సెప్టెంబర్ 10న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసనలకు బీఆర్ఎస్ సంఘీభావం తెలుపుతుంది. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కేటీఆర్ కోరారు.
ఇది కూడా చదవండి : Telangana Weather | నేటి నుంచి పెరగనున్న ఎండలు