అక్షరటుడే, ఎల్లారెడ్డి: Forest Officer Suspension | కామారెడ్డి (Kamareddy) జిల్లాలోని ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బొల్లారం సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు అటవీశాఖ (Forest Department) ఆదేశాలు జారీ చేసింది.
Forest Officer Suspension | బొల్లారం అటవీ సెక్షన్ పరిధిలోని..
బొల్లారం అటవీ సెక్షన్ పరిధిలోని ఎక్కపల్లి తండా, ఎక్కపల్లి, పర్కల్, శెట్పల్లి అటవీ బీట్ల పరిధిలో అడవుల నరికివేత, అటవీ భూముల ఆక్రమణలను నిరోధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనను సస్పెండ్ చేశారు. ఈనెల 1న కామారెడ్డి జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ) నీరజ్ కుమార్ త్రిపాఠి బొల్లారం సెక్షన్ పరిధిలోని ఎక్కపల్లి తండా అటవీ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ఎకరాల విస్తీర్ణంలో చెట్లను నరికివేసి అటవీ భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. అటవీ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం చెందిన డీఎఫ్‌వో, శెట్పల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్యాంసుందర్‌ను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విక్కీ మార్టిన్‌పై చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్)కు సిఫారసు చేశారు. డీఎఫ్‌వో సిఫార్సు మేరకు బొల్లారం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విక్కీ మార్టిన్‌ను సస్పెండ్ చేస్తూ పీసీసీఎఫ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి : ప్రియుడితో పారిపోయిన భార్య పెళ్లి చేసిన భర్త