National Lok Adalat | జాతీయ లోక్​ అదాలత్​ విజయవంతం: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్ కమిషనరేట్​ పరిధిలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే నిజామాబాద్ క్రైం: National Lok Adalat | నిజామాబాద్ (Nizamabad)​ కమిషనరేట్​ పరిధిలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

National Lok Adalat | 6,649 కేసులు పరిష్కారం..

ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా వివిధ సమస్యలకు సంబంధించి 6,649 కేసులు పరిష్కారమయ్యాయని సీపీ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్​లో భాగంగా జిల్లాకు చెందిన సైబర్ క్రైం, వివిధ కేసులలో రాజీ మార్గం జరిగిందన్నారు. కేసు పరిష్కారంలో జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన అధికారులు, సైబర్ క్రైం, కోర్టు సిబ్బందిని జిల్లా పోలీస్ కమిషనర్ అభినందించారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్ అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అన్నారు. అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు.

National Lok Adalat | రాజీమార్గమే రాజమార్గం..

రాజీ మార్గమే రాజా మార్గం అని.. రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చన్నారు. ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని , తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB ) డైరెక్టర్ శిఖాగోయల్ ఆధ్వర్యంలో ఏడు కమిషనరేట్​ల పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు, ప్రతి జిల్లాలో డీ–4సీని ఏర్పాటు చేసి డీఎస్పీ స్థాయి అధికారులచే పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాల్లో ఈ జాతీయ మెగా లోక్-అదాలత్​ ద్వారా 71 సైబర్ క్రైం కేసుల్లో రూ.24,02,552 తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్-అదాలత్​ను విజయవంతం చేసిన సీసీఆర్​బీ, కోర్ట్ డ్యూటీ, సైబర్ సెల్ సిబ్బందిని సాయి చైతన్య అభినందించారు.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డిని.. ఇమిటేట్ చేసిన తలసాని

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *