Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Rahul Ramakrishna Tweets | డిప్యూటీ సీఎం పవన్‌పై టాలీవుడ్ కమెడియన్ ప్రశ్నల వర్షం

Shivam nagarani
Last updated: June 8, 2026, 1:55 pm 1:55 pm
Shivam nagarani
Share
Rahul Ramakrishna Tweets

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rahul Ramakrishna Tweets | టాలీవుడ్ ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని పోస్టులు ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సామాజిక, రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను ముక్కుసూటిగా పంచుకునే ఆయన.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వరుస ప్రశ్నలు కురిపించారు. పవన్ బాధ్యతలు నిర్వహిస్తున్న శాఖల పనితీరు, పారదర్శకతను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ట్వీట్లు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Rahul Ramakrishna Tweets | ఆర్భాటాలు పక్కనపెట్టి ..

పవన్ కళ్యాణ్ చూస్తున్న ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం (RTI) ఎంతవరకు అమలవుతోందని రాహుల్ రామకృష్ణ ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం తన ఆర్భాటాలను పక్కన పెట్టి, ఆయన పరిధిలోని ప్రతి ప్రభుత్వ విభాగం వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం ముందస్తు సమాచారాన్ని బయట పెట్టాల్సిన సెక్షన్ 4.1(బి)ని ఆయా శాఖల్లో అమలు చేస్తున్నారా లేదా అని నిలదీశారు. తాను ఒక అభిమానిగానే బాధ్యతతో ఈ ప్రశ్నలు వేస్తున్నానని, దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.

Rahul Ramakrishna Tweets | అటవీకరణపై అనుమానాలు..

దీనితో పాటు గిరిజన ప్రాంతాల్లోని ప్రత్యేక చట్టాల అమలు తీరుపై కూడా రాహుల్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పెసా (PESA) చట్టం, 1/70 చట్టం, గ్రామసభ చట్టాల అమలుకు సంబంధించిన అసలైన ఫలితాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపట్టినట్లు చెబుతున్న అటవీకరణ కార్యక్రమాల వివరాలపై ఒక స్వతంత్ర సంస్థ సేకరించిన గణాంకాలు చూస్తే తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. తాను స్వయంగా క్షేత్రస్థాయిలో దాఖలు చేసి, గుర్తించిన ఫలితాల ఆధారంగానే ఈ వివరాలు కోరుతున్నానని చెబుతూ.. తన ట్వీట్ ముగింపులో ‘జై తెలంగాణ’ అని నినదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఇప్పటికే ఇక్కడ వివాదం నడుస్తున్న తరుణంలో ఈ నినాదం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

rahul ramakrishna.1

Rahul Ramakrishna Tweets | ప్రశ్నిస్తే దేశద్రోహిని కాను..

ఈ తరహా ప్రశ్నల వల్ల పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్ వచ్చే అవకాశం ఉందని ముందుగానే ఊహించిన రాహుల్ రామకృష్ణ.. మరో ట్వీట్‌లో దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. కేవలం ప్రజాప్రతినిధులను ప్రశ్నించినంత మాత్రాన తనను దేశద్రోహిగా ముద్రవేయలేరని ఆయన స్పష్టం చేశారు. బాధ్యత గల పౌరుడిగా, అభిమానిగానే ప్రజాప్రతినిధుల నుంచి జవాబుదారీతనాన్ని కోరుకుంటున్నట్లు ఆయన తన పోస్ట్‌ చివర్లో స్పష్టం చేశారు.

@PawanKalyan please ask and show for results for the implementation of PESA, 1/70 Act, Grama Sabha Act. The afforestation programs, did you do them? numbers seem dubious as verified by an independent body
I’m asking for filed and marked results

Jai Telangana!

— Rahul Ramakrishna (@eyrahul) June 7, 2026

ఇది కూడా చదవండి:  Jeevan Reddy Remarks | తెలంగాణ జాతిని అంతం చేసే యత్నం: మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

TAGGED:Andhra Pradesh politicsJanasenalatest newsPawan KalyanRahul RamakrishnaRTI ActSocial Media Controversytelugu newsTollywood newsTribal Laws
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Jeevan Reddy Remarks Jeevan Reddy Remarks | తెలంగాణ జాతిని అంతం చేసే యత్నం: మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి
Next Article Kishan Reddy Counter Kishan Reddy Counter | సింగరేణిపై కేటీఆర్​కు కిషన్​రెడ్డి కౌంటర్​
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Chicken Price Hike
తెలంగాణ

Chicken Price Hike | మాంసం ప్రియులకు షాక్​.. భారీగా పెరిగిన చికెన్​ ధరలు

By Shashi kiran Mottala
Paddy Procurement Transport
తెలంగాణ

Paddy Procurement Transport | లారీలు అందుబాటులో ఉంచాలి.. ధాన్యం కొనుగోళ్లపై కీలక ఆదేశాలు

By Srinivas Kolluri
Police Insurance
తెలంగాణ

Police Insurance | పోలీసులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కోటిన్నర బీమా ప్యాకేజీ!

By Balla Sandeep Kumar
Kharif Season
తెలంగాణ

Kharif Season | వానాకాలం సీజన్​పై మంత్రి తుమ్మల సమీక్ష

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.