Jeevan Reddy Remarks | తెలంగాణ జాతిని అంతం చేసే యత్నం: మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

సీఎం రేవంత్​రెడ్డికి ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. తెలంగాణ హిట్లర్ సీఎం రేవంత్ రెడ్డి అని ప్రజలకు ముందే తెలుసన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jeevan Reddy Remarks | సీఎం రేవంత్​రెడ్డికి ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. తెలంగాణ హిట్లర్ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అని ప్రజలకు ముందే తెలుసన్నారు.

రేవంత్​రెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. తాను హిట్లర్​ స్ఫూర్తితో హైడ్రా (Hydraa) ఏర్పాటు చేశానని తెలిపారు. హైడ్రా హిట్లర్​కు ఇష్టమైన పదం అన్నారు. దీనిపై తాజాగా జీవన్​రెడ్డి స్పందించారు. ఆ హిట్లర్​ యూధుల జాతిని అంతం చేస్తే.. ఈ హిట్లర్​ రేవంత్​రెడ్డి తెలంగాణ జాతిని అంతం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

Jeevan Reddy Remarks | అప్పుడే తెలుసు

లగచర్లలో భూమి కోసం పోరాడిన గిరిజనులకు బేడీలు వేసినప్పుడే సీఎం రేవంత్​రెడ్డి హిట్లర్​ అని తెలుసన్నారు. సున్నం చెరువులో ఇళ్లను కూల్చేశారని, పిల్లలు పుస్తకాలు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదని విమర్శించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లను కూల్చినప్పుడు సీఎం రేవంత్​రెడ్డి హిట్లర్​ అక్కడి ప్రజలకు తెలుసన్నారు. మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లు కూల్చే యత్నం చేస్తున్నప్పుడు వారికి సైతం తెలిసిందన్నారు.

Jeevan Reddy Remarks | తెలంగాణ గాడ్సే

Jeevan Reddy Remarks

రాష్ట్రంలో రైతు బంధు ఇవ్వకుండా సీఎం ప్రజలను మోసం చేశారన్నారు. రైతు బీమా సైతం అందడం లేదని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రంగాల వారు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. చివరకు రిటైర్​ అయిన ఉద్యోగులకు బెన్ఫిట్స్​ ఇవ్వడం లేదని విమర్శించారు. అప్పుడే సీఎం రేవంత్​రెడ్డి హిట్లర్​ అని ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ నియంత రేవంత్​ అన్నారు. పేదల ఇళ్లు కూల్చి మూసీ నది పక్కన గాంధీ విగ్రహం పెడితే సీఎం రేవంత్​రెడ్డి ఎప్పటికీ గాంధీ కాలేరని, తెలంగాణ గాడ్సే అవుతారని జీవన్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి..: Kavitha Education Demands | ఈ నెలలోనే ‘ఫీజుల నియంత్రణ చట్టం’ తీసుకురావాలి: కల్వకుంట్ల కవిత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *