HYDRAA Portal | అందుబాటులోకి హైడ్రా అధికారిక పోర్టల్.. ఇకపై ఆ సేవలు మరింత ఈజీ

హైదరాబాద్‌లో విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ బాధ్యతలు చూసే HYDRAA కీలక అడుగు ముందుకు వేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: HYDRAA Portal | హైదరాబాద్‌లో  ( Hyderabad )విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ బాధ్యతలు చూసే HYDRAA కీలక అడుగు ముందుకు వేసింది. ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించిన hydraa.telangana.gov.in అధికారిక పోర్టల్‌ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్   ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజలు హైడ్రా సేవలు, చెరువుల వివరాలు, విపత్తు సహాయం వంటి సమస్త సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

HYDRAA Portal | హెల్ప్‌లైన్ నంబర్..

అత్యవసర పరిస్థితుల కోసం హైడ్రా 24 గంటలు పనిచేసే 1070 హెల్ప్‌లైన్ నంబర్‌ను పోర్టల్‌లో ప్రముఖంగా అందుబాటులో ఉంచింది. భారీ వర్షాలు, వరదలు, రహదారులపై నీరు నిలవడం, చెట్లు కూలడం, అగ్నిప్రమాదాలు వంటి విపత్తు సమయాల్లో పౌరులు నేరుగా ఈ నంబర్‌కు ఫోన్ చేసి సాయం పొందవచ్చు. అలాగే, ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీల (NOC) కోసం కూడా ఈ పోర్టల్ ద్వారానే నేరుగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

HYDRAA Portal | డాప్లర్ రాడార్ అప్‌డేట్స్..

వర్షాకాలం, భారీ వర్షాల సమయంలో నగర ప్రజలను అప్రమత్తం చేసేందుకు లైవ్ రైన్‌ఫాల్ మ్యాప్స్, రోజువారీ వర్షపాత వివరాలు, వాతావరణ అంచనాలు, హైదరాబాద్ డాప్లర్ రాడార్ అప్‌డేట్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి. అలాగే నగరంలోని చెరువులు, కుంటలకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL), బఫర్‌ జోన్ల నిబంధనలు, చెరువుల హద్దులు, వాటి పరిరక్షణకు హైడ్రా చేస్తున్న ప్రయత్నాల పూర్తి వివరాలను ఇందులో చూసుకోవచ్చు.

HYDRAA Portal | భూ భారతి పోర్టల్‌కు డైరెక్ట్ లింక్..

ఎవరైనా భూములు లేదా స్థలాలు కొనుగోలు చేసే ముందు వాటి వివరాలు సరిచూసుకునేలా తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ‘భూ భారతి’ పోర్టల్‌కు హైడ్రా వెబ్‌సైట్‌లో నేరుగా లింక్ ఏర్పాటు చేశారు. దీనివల్ల సర్వే నంబర్లు, పట్టాదారుల వివరాలను సులభంగా పరిశీలించుకోవడానికి వీలవుతుంది. ప్రభుత్వ భూములు, కాలువల లెక్కలు, విపత్తు నిర్వహణ సమాచారం మొత్తం ఈ సింగిల్ పోర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండనుంది.

ఇది కూడా చదవండి:  Konda Surekha Warning | ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. కొండా సురేఖ వార్నింగ్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *