అక్షరటుడే, వెబ్డెస్క్ : MMTS Train Cancel | హైదరాబాద్ నగరంలో నడిచే పలు ఎంఎంటీఎస్ రైళ్లను (MMTS Trains) రెండు రోజుల పాటు వివిధ కారణాలతో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం, మంగళవారం పలు సర్వీసులను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా రద్దు చేనస్తున్నట్లు పేర్కొన్నారు.
MMTS Train Cancel | నిర్వహణ కారణాలతో..
నిర్వహణ కారణాలతో మే 11, 12 తేదీల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి – ఫలక్‌నుమా, ఫలక్‌నుమా – లింగంపల్లి, ఉందానగర్ – లింగంపల్లి మధ్య నడిచే రైళ్లను రెండు రోజుల పాటు పూర్తిగా రద్దు చేశారు. సికింద్రాబాద్ – ఫలక్‌నుమా, సికింద్రాబాద్ – ఉందానగర్ మధ్య నడిచే కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఈ మార్పును గమనించి ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరారు.
ఇది కూడా చదవండి..: Patancheru Cylinder Blast | హోటల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. కిలోమీటరు మేర వినిపించిన శబ్దం

