RTA Transparency Measures | ఏజెంట్ల వ్యవస్థకు చెక్..!

రవాణాశాఖ కార్యాలయంలో పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేస్తామని.. కార్యాలయంలో ఎలాంటి పనులు ఉన్నా నేరుగా సంప్రందించాలని డీటీవో రమేష్​ రాథోడ్​ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : RTA Transparency Measures | రవాణాశాఖ (Transport Department) కార్యాలయంలో పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేస్తామని.. కార్యాలయంలో ఎలాంటి పనులు ఉన్నా నేరుగా సంప్రందించాలని డీటీవో రమేష్​ రాథోడ్​ పేర్కొన్నారు. జిల్లాకు కొత్తగా బదిలీపై వచ్చిన ఆయనతో ‘అక్షరటుడే’ ఇంటర్వ్యూ.

RTA Transparency Measures | జిల్లాలో..

జిల్లాలో స్కూల్ బస్సులు 841, ప్రైవేట్​ బస్సులు 218 ఉన్నాయని డీటీవో తెలిపారు. టూవీలర్లు 3,88,982, ఆటోలు 28,959 ఉన్నాయని.. అయితే స్కూల్​ బస్సుల్లో ఇప్పటివరకు 595 ఫిట్​నెస్​ పూర్తి చేసుకున్నాయని.. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం స్కూళ్లు ప్రారంభం కానున్నందున వాటిపైనే ఎక్కువగా ఫోకస్​ చేస్తున్నామన్నారు. ప్రతి ప్రైవేట్​ స్కూల్​ బస్సు (Private school bus) తప్పనిసరిగా ఫిట్​నెస్​ చేయించుకోవాలని సూచించారు. ఫిట్​నెస్​ లేని బస్సులు రోడ్లపై తిరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

RTA Transparency Measures | ఏజెంట్లకు కార్యాలయంలో పనిలేదు..

RTA Transparency Measures

ఆర్టీఏ సేవలు పూర్తి పారదర్శకంగా అందజేస్తామని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్​ తెలియజేశారు. ఎలాంటి సమస్య ఉన్నా తమ కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని, ఆన్​లైన్​ వెబ్​సైట్​లో కూడా వివరాలు పొందుపర్చామని వివరించారు. ఏజెంట్లను సంప్రదించి నష్టపోవద్దన్నారు. వారికి కార్యాలయంలో పని లేదని స్పష్టం చేశారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు సైతం ‘వాహన్​’ వెబ్​సైట్​లో జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్టీఏ నిజామాబాద్​ (Nizamabad) ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణకు గతంలో వాహనదారులకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లోనూ ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. వర్షాకాలంలో వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలుంటాయని.. వాహదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

RTA Transparency Measures | ప్రమోషన్లలో సిబ్బంది వచ్చే అవకాశం

జిల్లా ఆర్టీఏలో ముగ్గురు ఎంవీఐలు, ఐదుగురు ఏఎంవీఐలు ఉండాల్సి ఉందని డీటీవో తెలిపారు. అయితే ప్రమోషన్లలో భాగంగా సిబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. జిల్లాలో పోలీస్​శాఖతో సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తామన్నారు. వాహనదారులు తమ పెండింగ్​ చలాన్లను ఎప్పటికప్పుడు క్లియర్​ చేసుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Development Works | ప్రతి డివిజన్​లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి : మేయర్​ ఉమారాణి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *