Vegetable Farmers | కూరగాయల రైతుల కష్టాలు తీరేదెన్నడో..?

కామారెడ్డి పట్టణంలో కూరగాయల రైతులకు కష్టాలు తప్పడం లేదు. రోడ్డు పక్కన విక్రయిస్తుండడంతో వర్షాలు కురిసిన సమయంలో అవస్థలు పడుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Vegetable Farmers | కూరగాయల రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇంటినుంచి తెచ్చిన కూరగాయలు మార్కెట్​లో (Kamareddy Vegetable Market) అమ్ముడుపోయే వరకు నమ్మకం లేకుండా పోయింది. ఏదో ఒక రూపంలో వారు నష్టపోతూనే ఉన్నారు.

Vegetable Farmers | కామారెడ్డి పట్టణంలో..

కామారెడ్డి (Kamareddy) పట్టణంలో ఆదివారం సాయంత్రం ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి సుభాష్ రోడ్డు, జయప్రకాష్ నారాయణ్ విగ్రహం వరకు రైతులు కూరగాయలు రోడ్లపై పెట్టుకుని విక్రయిస్తున్నారు. వర్షం కారణంగా రైతులు కూరగాయలను రోడ్లపై వదిలేసి షాపుల చూరు కింద నిలబడి దీనంగా చూస్తూ ఉండిపోయారు. జనాలు కూడా రాకపోవడంతో రోడ్డుపై ఉన్న కూరగాయలు వర్షానికి తడిసిపోయాయి. కూరగాయలు విక్రయాలు జరగక రైతులు ఆందోళనకు గురయ్యారు. మిగిలిన కూరగాయలను అతి తక్కువ ధరకు అమ్ముకుని ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించారు. వర్షంలో నుంచి కూరగాయల గంపలను షాపుల మడిగెల పైకి తీసుకుని వెళ్ళడానికి అష్టకష్టాలు పడ్డారు. మరోవైపు ప్రతిరోజు ఒక్కో రకం కూరగాయలకు రూ.10 చొప్పున ఉండే తైబజార్ పన్ను ఆదివారం ఒక్కో రకానికి రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతులు లేకున్నా రోడ్లపై కూరగాయలు విక్రయిస్తూ నష్టపోతున్న తమకు నిలువ నీడ కల్పించాలని రైతులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy | ఇండియాకు వస్తున్నా.. ఆ అంశాలపై మాట్లాడతా..: సీఎం రేవంత్​రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *