Tarun Bali Death | కెనడాలో విషాదం.. భారత సంతతి పోలీసు మృతి

కెనడాలో అంటారియో ప్రావిన్షియల్ పోలీస్ (OPP) అధికారిగా పనిచేస్తున్న పంజాబ్‌కి చెందిన తరుణ్ బాలి (28) విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tarun Bali Death | కెనడాలో అంటారియో ప్రావిన్షియల్ పోలీస్ (OPP) అధికారిగా పనిచేస్తున్న పంజాబ్‌కి చెందిన తరుణ్ బాలి (28) విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అటు కెనడాలోని భారతీయ సమాజంలోనూ, ఇటు పంజాబ్‌లోని నంగల్ పట్టణంలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది.

Tarun Bali Death | ఏం జరిగిందంటే..

మంగళవారం మధ్యాహ్నం అంటారియోలోని హర్స్ట్ ప్రాంతంలో తరుణ్ బాలి తన బృందంతో కలిసి విధుల్లో ఉండగా ఈ దురదృష్టకర ఘటన జరిగింది. దర్యాప్తులో భాగంగా అక్కడికి వెళ్లిన పోలీసు అధికారులపైకి, ఒక నిందితుడు ఉద్దేశపూర్వకంగా వాహనాన్ని దూసుకెళ్లడంతో కానిస్టేబుల్ తరుణ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, తరుణ్ మరణించారు. ఈ ఘటనలో మరో అధికారి కూడా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.

Tarun Bali Death | ఎవరీ తరుణ్ బాలి?..

తరుణ్ బాలి పంజాబ్‌లోని రోపర్ జిల్లా, నంగల్ పట్టణానికి చెందినవారు. కొన్నేళ్ల క్రితం ఆయన తన తల్లిదండ్రులతో కలిసి కెనడాకు వలస వెళ్లారు. సుమారు రెండున్నర ఏళ్ల క్రితం అంటారియో ప్రావిన్షియల్ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరి విధులు నిర్వహిస్తున్నారు.

Tarun Bali Death | నిందితుడిపై కేసు నమోదు..

ఈ ఘటనకు సంబంధించి 18 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు నిందితుడు ఒక ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చి, పోలీసులపైకి వాహనంతో దాడి చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడిపై ‘ఫస్ట్-డిగ్రీ మర్డర్’ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Meenakshi Natarajan Nomination | మీనాక్షి నటరాజన్​ కేసు వివరాలు బయట పెట్టింది ఎవరు : బీఎల్​ సంతోష్​

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *