Saudi Airport Missile Attack | సౌదీ ఎయిర్​పోర్టుపై మరోసారి క్షిపణులతో దాడి

సౌదీ అరేబియాలోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుపై ఆదివారం అర్ధరాత్రి క్షిపణులతో హౌతీలు దాడి చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Saudi Airport Missile Attack | సౌదీ అరేబియాలోని మరో ఎయిర్​పోర్టుపై హౌతీ రెబల్స్ క్షిపణులతో విరుచుకుపడ్డారు. కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుపై ఆదివారం అర్ధరాత్రి దాడి చేశారు.

యెమెన్‌ (Yemen)కు చెందిన హౌతీ గ్రూపు శనివారం రాత్రి జరిపిన క్షిపణి దాడిలో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 4పై క్షిపణి పడటంతో మంటలు చెలరేగి, ఒక వ్యక్తి మరణించాడు. ఈ ఘటనలో మరో 11 మంది గాయపడ్డారు.

Saudi Airport Missile Attack | ఎయిర్​పోర్టు మూసివేత

గత వారంలో విమానాశ్రయంపై జరిగిన పలు దాడులలో భాగంగా, సౌదీ వాయు రక్షణ వ్యవస్థలు విమానాశ్రయం సమీపంలోకి వచ్చిన ఒక క్రూయిజ్ క్షిపణిని కూడా అడ్డుకున్నాయి. ఈ వరుస దాడుల కారణంగా రియాద్ అధికారులు కింగ్ ఖాలిద్ విమానాశ్రయంలో కార్యకలాపాలను నిలిపివేశారు. ఐదు రోజుల్లో ఈ విమానాశ్రయంపై నాలుగుసార్లు దాడులు జరగడం గమనార్హం. శనివారం జరిగిన దాడిలో ఏకంగా 300 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్​ మద్దతు ఉన్న హౌతీలు దమ్మామ్ విమానాశ్రయంతో సహా పలు ప్రాంతాల్లో దాడులు చేశారు.యెమెన్ రాజధాని సనాలోని విమానాశ్రయంపై మరోసారి దాడి జరిగిందని, అందుకు సౌదీలే కారణమని హౌతీలు ప్రకటించిన కొద్దిసేపటికే రియాద్‌లో దాడి జరగడం గమనార్హం.

ఇది కూడా చదవండి..: Russia Ukraine Ceasefire | ఎనర్జీ సీజ్​ ఫైర్​.. రష్యా – ఉక్రెయిన్​ యుద్ధంపై ట్రంప్​ కీలక ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *