అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oct 12 Market Analysis | రష్యాRassia తో అమెరికా(America) డీజిల్ సరఫరా ఒప్పందం, ఇంధన సౌకర్యాలపై దాడులను నిలిపివేయడానికి ఉక్రెయిన్ మరియు రష్యా అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడంతో ముడి చమురు ధరలు కాస్త శాంతించాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లు (Global markets)లాభాల బాటలో సాగుతున్నాయి.
Oct 12 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్ 0.64 శాతం, ఎస్ అండ్ పీ 0.59 శాతం లాభపడగా.. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.35 శాతం లాభంతో ఉంది.
Oct 12 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.12 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.94 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 1.05 శాతం పెరిగాయి.
Oct 12 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 8.10 గంటల ప్రాంతంలో సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.57 శాతం హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.19 శాతం లాభంతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.24 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.69 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.09 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. జపాన్ మార్కెట్లకు సెలవు. గిఫ్ట్ నిఫ్టీ 0.14 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
గమనించాల్సిన అంశాలు..
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా పదకొండో సెషన్లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. నికరంగా రూ. 3,568 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
డీఐఐలు వరుసగా 42 వ సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 4,743 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి 96.73 వద్ద ఉంది.
క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 102.98 డాలర్ల వద్ద ఉంది.
యూఎస్ డాలర్ ఇండెక్స్ 102.14 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.24 శాతం వద్ద ఉంది.
నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.73 నుంచి 1.14కు పెరిగింది.
విక్స్ 5.89 శాతం తగ్గి 14.37 వద్ద ఉంది.