అక్షరటుడే, వెబ్డెస్క్: Russian Love Story | “ప్రేమకు సరిహద్దులు లేవంటారు.. భాషతో సంబంధం లేదు, దేశాల సరిహద్దులతో పనే లేదు, అంతస్తులు అసలే అక్కర్లేదు! మనసున మనసైతే అమృత కావ్యమే అవుతుందని నిరూపించింది ఒక సత్యమైన ప్రేమకథ.
కోట్లతో తులతూగే విలాసాలను వదులుకుని, కేవలం తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కోసం ఏకంగా రష్యా (Russia) నుంచి బీహార్లోని ఒక చిన్న గుడిసెకు చేరుకుంది ఒక పరదేశీ భామ. ఇది కేవలం ఒక వార్త కాదు.. కాలం చెరిగిపోని ఒక అభినవ ప్రేమ కావ్యం! ఆ మనసును దోచే క్యూట్ లవ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం!
Russian Love Story | రష్యన్ యువతితో పరిచయం

కొన్నాళ్ల క్రితం ఉపాధి నిమిత్తం బీహార్ నుంచి రష్యా వెళ్లాడు రాహుల్ యాదవ్ అనే సాధారణ యువకుడు. మంచు కురిసే ఆ హిమ సీమలో, అనుకోకుండా ఒక రష్యన్ యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొద్దిరోజుల్లోనే ఒక పవిత్రమైన అనురాగానికి దారితీసింది.ఇద్దరి హృదయాలు ఒకటయ్యాయి. కానీ, కొంతకాలానికి రాహుల్ తన పనులు ముగించుకుని తిరిగి భారత్కు చేరుకున్నాడు. తీరం దాటి వేరైనా.. వారి హృదయాల స్పందన మాత్రం ఆగలేదు!
Russian Love Story | ఆరు నెలల విరహ వేదన
ప్రియుడి జ్ఞాపకాల్లో తల్లడిల్లిపోయిన ఆ రష్యన్ సుందరి.. ఆరు నెలల విరహ వేదన తర్వాత ఇక ఉండలేకపోయింది. కన్నవారిని మెప్పించి, తన కుటుంబ సభ్యులతో కలిసి సరిహద్దులు దాటి భారతదేశానికి, నేరుగా బీహార్లోని రాహుల్ గ్రామానికి చేరుకుంది.అక్కడ తన ప్రియుడు ఒక చిన్న గుడిసెలోనే జీవిస్తున్నాడని తెలిసినా ఆమె అడుగు వెనక్కి పడలేదు. మహల్లాంటి సౌకర్యాలు లేకపోయినా.. ప్రేమికుడి కళ్లల్లోని ప్రేమే తనకు కొండంత నిధి అని భావించింది. అతని గుడిసే తన పాలిట స్వర్గమని, అతనితోనే తన శేష జీవితమని ఆ విదేశీ భామ చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరి హృదయాలను తాకుతున్నాయి!
Russian Love Story | నవంబర్ నెలలో వివాహం
అందానికి, స్వచ్ఛమైన మనసుకు ప్రతీకగా నిలిచిన ఆ రష్యన్ యువతి గొప్ప మనసును, ఆమె ప్రేమను చూసి ఇరు కుటుంబాల పెద్దలు మురిసిపోయారు. రాహుల్-రష్యన్ భామల అమర ప్రేమకు గుర్తుగా వచ్చే నవంబర్ నెలలో వైభవంగా వివాహం జరిపించేందుకు నిశ్చయించారు. సిరిసంపదల కంటే స్వచ్ఛమైన అనురాగాన్నే మిన్నగా భావించిన ఆ రష్యన్ రాజకుమారికి మనమంతా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుదాం!
ఇది కూడా చదవండి..: CJP Leaders | సీజేపీ నాయకులకు 5 రోజుల జైలు శిక్ష