Power Cuts in Nizamabad | అర్ధరాత్రి చిమ్మచీకట్లు.. తరచూ విద్యుత్ ​కోతలతో అవస్థలు

నగరంలో విద్యుత్​ కోతలు ప్రజలను వేధిస్తున్నాయి. అర్దరాత్రి పూట కరెంట్​ పోతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని నగరవాసులు పేర్కొంటున్నారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Power Cuts in Nizamabad | నగరంలో విద్యుత్​ కోతలు ప్రజలను వేధిస్తున్నాయి. వేళాపాళా లేని కోతల కారణంగా చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా అవస్థలు పడుతున్నారు.

Power Cuts in Nizamabad | అర్ధరాత్రి వేళ..

నగరంలోని పలు డివిజన్లలో ఉదయం, సాయంత్రం అని తేడా లేకుండా కరెంట్​ సరఫరా (Power Supply)లో అంతరాయం ఏర్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఒక్క క్షణం కూడా కరెంట్​ పోకుండా ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్​ సరఫరా చేస్తున్నామని పేర్కొంటున్నప్పటికీ నగరంలో ఆ పరిస్థితి లేదని ఆయా డివిజన్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో కరెంట్​ కోతల కారణంగా ఉక్కపోతతో అవస్థలు పడుతున్నామని వారంటున్నారు. ఓవైపు గాలివాన.. మరోవైపు విద్యుత్​ లేక నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Power Cuts in Nizamabad | 27వ డివిజన్​లో..

27 డివిజన్​లోని సీతారాంనగర్​ కాలనీలో తరచూ విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లలోనే పవర్​ కట్​ అవుతుండడంతో ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనధికార కోతల నుంచి తమకు విముక్తి కల్పించాలని.. నిరంతరాయంగా విద్యుత్​ సరఫరా చేయాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: MLA Dhanpal | విద్యార్థులు స్మార్ట్​ఫోన్లకు దూరంగా ఉండాలి..: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్